~ స్వీయ
పూరేకులు పరిచిన హృదయమార్గంలో సుతిమెత్తని అడుగై నడిచి వస్తావని
నిరీక్షణ...
నిరీక్షణ...
కలువ మొగ్గల కన్నులలో పండు వెన్నెలై కురుసి వరిస్తావని
నిరీక్షణ...
నిరీక్షణ...
మౌనరాగాల మదిలో కోటి స్వరాల విపంచివై వినిపిస్తావని
నిరీక్షణ...
నిరీక్షణ...
విరజాజి రేకు సొగసుకు సుర సౌరభాల శోభనిస్తావని
నిరీక్షణ...
నిరీక్షణ...
సంద్రమైన కన్నులలో స్వాతి ముత్యమై మెరుస్తావని
నిరీక్షణ...
కలవరింతల కాలంలో కౌగిలింతల వరమిస్తావని
నిరీక్షణ...
~ ప్రియ
1 comments:
Chala bavundi :)
Post a Comment