~ స్వీయ
ఎదుటివాడి బాధ మన సంతోషానికి కారణం అవుతోంది . . !
లేదా
వాడి సంతోషం మన బాధకు కారణం అవుతోంది . . ! !
ఏంటీ పరిస్థితి !
దీన్ని మార్చలేమా ? ?
కాదు కాదు, మారాల్సింది పరిస్థితి కాదు . .
మన మనఃస్థితి..!!
మన బాధ మనకి బాధే అయినప్పుడు,
ఎదుటివాడి వాడి బాధ కూడా మనకు బాధే అవ్వాలి.
మన సంతోషం మనకు సంతోషం అయినప్పుడు,
ఎదుటివాడి సంతోషం మనకు సంబరమవ్వాలి . .
ఆలోచిస్తే చాలా చిన్న విషయం . .
ఆచరిస్తే చాలా గొప్ప విషయం . . .
ఒక్కసారి ఆలోచిద్దాం ! ఆచరిద్దాం ! !
మార్పు ఎలా రాదో చూద్దాం ! ! !
~ ప్రియ
2 comments:
స్వీయ గారు,
చక్కటి తలంపు, ఓ మంచి ద్రుక్పధం మీ ఈ కవిత యొక్క సందేశం. అందరూ ఇదే ఆలోచిస్తే ఆచరిస్తే జగమత కుటుంబం మనది. మీ ఇతర బ్లాగులు చూశాను కానీ ఇలా బొమ్మలూ కవితల తో ఇద్దరు మిత్రుల బ్లాగు చూట్టం ఇదే మొదలు. "బాపు-రమణల" మీరూ మంచిపేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ:)
నందు
ధన్యవాదాలు నందు గారు..
Post a Comment