పాతబస్తీ లోని ముస్లిం యువతుల జీవితాలపై పేదరికం, కుటుంబంలో అధిక సంతానం , మతం వంటివి చేస్తున్న దౌర్జన్యాలకు స్పందిస్తూ....
అక్కడ పరదాల మాటున ఫత్వాలు ఎరుగని నీడలు కదలాడుతూ ఉంటాయి...!
హిజాబుల ముసుగులో హిసాబ్ తేలని ప్రశ్నలు వేళ్ళాడుతూ కనిపిస్తాయి...!
వెలుగు రేఖలకైనా చోటులేని ఇరుకు ఆవాసాలలో
చీకటి రంగుతో సహవాసాలు చేస్తున్న చూపులు,
ముజాహాబ్లు అంటుకుని మసిబారిపోయిన గోడల మధ్యన
ముడుచుకుపోయి, నలగిపోయిన మనసులు ఎదురవుతాయి...!
రెక్కలు కత్తిరించి పంజరంలో పడవేయబడ్డ పక్షులు
ఊచల కమ్మీలలోంచి చూస్తుంటాయి...!
ఆంక్షలు , ఆంక్షలు.... ఎటు చూసినా అడ్డుగోడలు ...
షబాబ్ శాపం ఒంటికి చుట్టుకుంటుంది...
గరీబ్ భూతం వెంటాడుతుంది...
అరబ్ అత్తరు ఒలికి బ్రతుకు బుగ్గవుతుంది ...!!
ఫత్వా= పరిష్కారం
హిజాబ్ = బురఖా
హిసాబ్= లెక్క
ముజాహాబ్ = మతం
షబాబ్= యవ్వనం
1 comments:
బావుందండి.అర్ధం ఇవ్వడం వలన కవిత పూర్తిగా అర్ధం చేసుకోగలిగాను.
Post a Comment